'లిటిల్ ఇండియా'పై ఇరాన్ దాడి
ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరం ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. డిమోనా జనాభాలో 30 శాతం మంది భారత సంతతికి చెందిన వారే కావడంతో దీనిని 'లిటిల్ ఇండియా' అని పిలుస్తారు. ప్రస్తుతం అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. కాగా ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.