కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: డైరెక్టర్

కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: డైరెక్టర్

NLR: కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని పౌరసరఫరాల శాఖ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అన్నారు.శనివారం కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ, ధాన్యం కొనుగోలు, తదితర సేవలను ప్రజలకు అందిస్తుందన్నారు. రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు.