'గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి'
JGL: గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, గంజాయి నిర్మూలనపై గ్రామస్థులకు కళాజాత ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు కళాకారులు పరశురాం, మహిపాల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.