నేడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాక

KRNL: కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రానున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లవుతున్న సందర్భంగా గ్రామంలో వంద మొక్కలు రామకృష్ణ నాటనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు.