బాధితులకు సీఎంఆర్ చెక్కు పంపిణీ

KMR: సీఎంఆర్‌ఎఫ్ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. డోంగ్లి మండలం, లింబూర్ గ్రామానికి చెందిన అనంత్ మణివార్‌కు మంజూరైన రూ.60,000 చెక్కును ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు ఈరోజు అందజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.