VIDEO: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
VSP: పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో రూ.7.16 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ రాపర్తి త్రివేణితో కలిసి సమతా నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.