బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే

NLG: పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపూర్‌లో పెరికేటి రామకృష్ణ అనే వ్యక్తి మోటార్ మెకానిక్ షాపులో ఇటీవల షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.9 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు భాదితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలునాయక్ బాధితున్ని పరమర్శించి ఆదుకుంటామన్నారు.