'పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలి'
MBNR: పాలమూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ హోం మంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు. శనివారం మర్లు 23వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పిల్లి అనిత రాజుకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.