మహిళను బెదిరించి బంగారం చోరీ
NLG: కేతేపల్లి(M) ఇనుపాములలో మహిళను బెదిరించి పుస్తెలతాడు, చెవిదిద్దులను చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామశివారులో నివాసం ఉంటున్న ఉప్పల వెంకటరమణమ్మ శనివారం పెరట్లో ఉన్న గేదెలకు మేతవేసేందకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియాని వ్యక్తి జాతీయ రహదారి మీదకి ఎలా వెళ్లాలాని అడుగుతూ.. కత్తితో బెదిరించి మెడలోని ఆభరణాలు దొంగలించాడు.