ఖైదీల సమస్యలు తెలుసుకున్న న్యాయమూర్తి
ప్రకాశం: గిద్దలూరు సబ్ జైలును జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) సెక్రటరీ, ఒంగోలు, సీనియర్ సివిల్ జడ్జి ఇబ్రహీం షరీఫ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వరుస క్రమంలో ఖైదీలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలను ఆరా తీశారు. ఈ మేరకు ఖైదీలకు చట్టబద్ధమైన న్యాయ సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి వారికి హామీ ఇచ్చారు.