'శిశు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు'
NLG: శిశు విక్రయాలు చట్ట విరుద్దమని తీవ్రమైన నేరమని ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రసన్న అన్నారు. బుధవారం చందంపేట మండలం తెల్దేవరపల్లి సెక్టార్ పరిధిలో విస్తృతంగా శిశు విక్రయాల మీద అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. గర్భిణీలు, బాలింతల ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ తన బిడ్డలని పెంచుకోవాలని, లేకపోతే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.