పురపాలక వాహనాలకు బీమా లేదు.. కార్మికులకు భద్రత లేదు

JN: జనగామ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య సేవలను సక్రమంగా అందించేందుకు సమగ్ర విధానం కరవైంది. వాహనాల నిర్వహణతో పాటు కార్మికుల భద్రత కరవైంది. ఇంజినీరింగ్ అధికారల మధ్య సమన్వయం లోపించడంతో వాహనాలకు బీమా కొరడింది. వాహనాల వినియోగంలో పురపాలిక అధికారులు రవాణాశాఖ నిబంధనలను కనీసం పట్టించుకోవడంలేదు. ఫలితంగా దీంతో బీమా లేని వాహనాలపై పని చేసేందుకు కార్మికులు భయపడుతున్నారు.