నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే భరోసా
KDP: జమ్మలమడుగులో నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతను పరామర్శించి, వారిని ఉద్యోగ పోరాటంలో ముందుకు సాగాలని ఆయన ప్రోత్సహించారు. యువత ఉద్యోగాలలో ఒక్కో మెట్టు ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.