ఇదే జరిగితే HYD నీటి కష్టాలు తీరినట్లే..!

HYD: నగరంలో నీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రపంచ బ్యాంక్ సహకారం తీసుకుంటున్నారు. అందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఖైరతాబాద్‌లోని జల మండలి కార్యాలయంలో అధికారులతో సంప్రదింపులు జరిపారు. అన్నీ అనుకూలిస్తే దాదాపు రూ. 10వేల కోట్లు మన వాటర్ బోర్డుకు ప్రపంచ బ్యాంకు ఇవ్వనుంది.