అమరావతి రోడ్డు పనుల పరిశీలన
PLD: అమరావతి-బెల్లంకొండ రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ధరణికోట-మల్లాది మధ్య జరుగుతున్న పనులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ రోడ్డును నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తోందని తెలిపారు.