'ప్రజలకు మంచి సేవలు అందించాలి'
SKLM: ప్రజలకు మంచి సేవలందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఆయన అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేయాలన్నారు.