'కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు సహకరించండి'

'కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు సహకరించండి'

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిత్ శుక్రవారం సాయంత్రం వివిధ పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు. ప్రజలలో లోక్ అదాలత్ మీద అవగాహన కల్పించాలని కోరారు. సత్వరంగా కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు సహకరించాలన్నారు.