శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.