కుమారుడి పెళ్లి.. హెలికాప్టర్‌లో వెళ్లి ఆహ్వానం

కుమారుడి పెళ్లి.. హెలికాప్టర్‌లో వెళ్లి ఆహ్వానం

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ తన కొడుకు పెళ్లి ఆహ్వానాన్ని ప్రత్యేకంగా అందించింది. పుట్టింటి నుంచి మెట్టింటి మధ్య 25 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఆమె హెలికాప్టర్ అద్దెకు తీసుకుని భౌదాఖుర్ద్‌లోని పుట్టింటికి వెళ్లి అన్నదమ్ములను ఆహ్వానించింది. తన కొడుకు రోహిత్ దహియా.. ఈ ఆహ్వానం మేనమామలకు గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడని తెలిపింది.