VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

AP: శ్రీకాకుళం జిల్లా జర్జాం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకొచ్చి.. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలినవారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.