ఓడలరేవుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

ఓడలరేవుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ సైట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం ఛాపర్ హెలికాప్టర్లో దిగారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, కూటమి నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి తుపాను ప్రభావంతో నాశనమైన పంటలను ఆయన పరిశీలించనున్నారు.