VIDEO: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు
HNK: కాజీపేట పట్టణంలోని బాపూజీ నగర్‌లోని కారుణ్య క్లీనిక్ సమీపంలో చైన్ స్నాచింగ్ జరింది. బుధవారం పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.