పేకాట స్థావరంపై దాడులు.. 11 మంది అరెస్ట్
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గండ్లపెంట మండలంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలు, రూ.8,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.