జనగామ: 99.91 శాతం మంది హాజరు

జనగామ: 99.91 శాతం మంది హాజరు

జనగామ్: జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి గణితం పరీక్షలో 6,698 మంది విద్యార్థులకు గాను 6,692 విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి కె. రాము తెలిపారు. ఈ పరీక్షకు ఆరుగురు విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లాలో 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు. అదే విధంగా నలుగురు ప్రైవేట్ విద్యార్థులకు గాను ముగ్గురు హాజరయ్యారని ఒకరు హాజరు కాలేదన్నారు.