రూ. 52లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ. 52లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

KKD: కరప మండలం అరట్లకట్టలో ఎమ్మెల్యే పంతం నానాజీ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.28.15 లక్షలతో సీసీ రోడ్డు, రూ.34 లక్షలతో కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఆయన, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.