నేడు సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం
బీహార్ ముఖ్యమంత్రిగా JDU చీఫ్ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదాన్ వేదికగా జరగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా, బీహార్ CMగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది పదో సారి.