రాజనాల బండ హుండీ ఆదాయం రూ.4.13 లక్షలు

CTR: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ హుండీ ఆదాయం రూ.4.13 లక్షలు సమకూరినట్లు TTD సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం రాజనాల బండ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టగా ఆదాయం సమకూరిందన్నారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి ఖాతాకు జమ చేయనున్నట్లు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ భాను తెలిపారు.