గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

NLR: రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి తహశీల్దార్ కోటేశ్వర రావు తెలిపారు. బుధవారం మండల పరిధిలో శెట్టిపాలెం, వెలిగండ్ల గ్రామంలో రెవెన్యూ గ్రామ సభలు జరిగాయి. మొత్తం 5 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాసుకు, విఆర్వో డమ్ము మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.