నల్లజర్ల పీహెచ్‌సీలో వివిధ శాఖల సమన్వయ సమావేశం
E.G: నల్లజర్ల పీహెచ్‌సీలో వైద్యాధికారి డా. సిరాజ్ఉద్దీన్ ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. వేసవి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులకు, అంగన్వాడీలకు వివరించారు. ఆర్‌బీఎస్‌కే పరీక్షలు, వ్యక్తిగత పరిశుభ్రత, పోషణ పక్వాడాపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేకుండా పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.