భవిష్యత్తు తరాల కోసం ప్రకృతి వ్యవసాయం చేయాలి: గోపయ్య

SRPT: భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త ములుగురి గోపయ్య అన్నారు. ఇవాళ నడిగూడెం మండలంలోని కోడిపుంజుల గూడెం, సిరిపురం, వల్లాపురం తదితర గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వాడకంతో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. సేంద్రియ ఎరువులు ఉపయోగించి పంటలు పండించాలన్నారు.