ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన వాయిదా

ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన వాయిదా

NLG: కొండమల్లేపల్లి మండలం కోల్ ముంతల్ పహాడ్ రైతు వేదిక వద్ద నేడు జరగాల్సిన "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్" శంకుస్థాపన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొనాల్సి ఉంది.