'పురుగుల మందు కలిసిన నీళ్ళు తాగి మేకలు మృతి'

VKB: కోట్‌పల్లి మండలం వెల్చాల్ గ్రామానికి చెందిన తలారి అశోక్ మేకలు అదే గ్రామానికి చెందిన రాసయ్య పొలంలోని సంపులో పురుగు మందు కలిసిన నీరు తాగి మృతి చెందాయి. ఈ ఘటనలో 15 మేకలు చనిపోయాయని అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో SI శైలజ కేసు నమోదు చేశారు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.