ఘనంగా రంజాన్ వేడుకలు

ఘనంగా రంజాన్ వేడుకలు

సత్యసాయి: సోమందేపల్లిలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు శనివారం అల్లాహ్ నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి నుండి ఈద్గా మైదానం వరకు ముస్లిం సోదరులు భారీగా ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.