అలంపూర్‌లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
GDWL: అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలో గత నాలుగేళ్లుగా ప్రైవేట్ లేబర్‌గా పనిచేస్తున్న 16 మంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదు. ఈ సందర్భంగా వారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్‌ను బుధవారం కలిసి తమ సమస్యను వివరించారు. తమను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించి, IFMIS పోర్టల్లో పేర్లు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.