వర్షాల వేళ కలెక్టర్ ఆదేశాలు జారీ
KRNL: వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు, నదీతీర ప్రాంతాలను పరిశీలించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి, వాగులు - వంకల వద్ద రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.