ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
MNCL: మంచిర్యాల కలెక్టరేట్ లో శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, సబ్ కలెక్టర్ మనోజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.