రేపు మట్టి విగ్రహాల పంపిణీ

NRML: పర్యావరణహితమే సమాజ హితమని భైంసా పట్టణ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పి.కాశీనాథ్ అన్నారు. వినాయక చవితి నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం ఎదుట హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.