వైసీపీలోకి జేసీ పవన్ రెడ్డి..?
AP: అనంతపురం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు స్థానిక రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 2014లో జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో.. 2029లోనూ అదే జరుగుతుందని, వైసీపీలో చేరితే సీటు దక్కుతుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.