అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదకు యూత్ సాయం..!

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదకు యూత్ సాయం..!

SRD: నిజాంపేట మండలం ఈదుల్ తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద పెద్ద లక్ష్మణ్‌కు ఈదుల్ తండా యూత్ బాధ్యులు రూ.11,100 ఆర్థిక సాయాన్ని బుధవారం అందజేశారు. వైద్య ఖర్చులు, మందులకు ఈ నిధులు ఉపయోగించుకోవాలని బాధితుడికి సూచించారు. తమను ఆదుకుని సాయం చేసిన యూత్‌కు ఆ నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.