పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చండి మహాప్రభో..!

GNTR: చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెంలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. మురుగునీరు పారే మార్గం లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్య కేంద్రం ఎదుటే పెద్ద గుంతలో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారింది. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలన ప్రజలు కోరుతున్నారు.