దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
VKB: కొడంగల్ మండలానికి మంజూరైన విద్యా సంస్థలను పక్క మండలలకు తరలించవద్దని కోరుతూ KDP JAC ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శనివారం ఉదయం దీక్ష శిబిరం వద్దకు టెంట్ సామగ్రీతో వచ్చిన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదని, ఇక్కడ నిరసన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.