నేటి నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నేటి నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కాకినాడ డిపో నుంచి మార్చి 27న భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. కాకినాడ డిపో నుంచి రోజువారీ 7 బస్సులతో పాటు, అదనంగా 10 బస్సులు నడపనున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.