VIDEO: హిరమండలంలో గుంతల రోడ్డు
SKLM: హిరమండలం మండల కేంద్రంలో రోడ్డు మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు అంటున్నారు. ఈ గుంతలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు వాపోతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు మరీ ఎక్కువ అవుతున్నాయని వాహనదారులు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి, మరమ్మత్తు పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.