'అన్నదాత సుఖీభవ పథకానికి 20లోగా ఫిర్యాదు చేయాలి'

VBZM: అన్నదాత సుఖీభవ పథకం ఫిర్యాదుల మాడ్యూల్ ఈనెల 20న ముగుస్తుందని మండల వ్యవసాయ అధికారి పి శ్రీలక్ష్మి తెలిపారు. నెల్లిమర్లలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈకేవైసీ సమస్య కారణంగా తిరస్కరించబడి అర్హత ఉన్న రైతులు ఆధార్, 1బి, బ్యాంకు అకౌంట్, రేషన్ కార్డుతో గడువుకి ముందే రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా తమ ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు