సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలని వినతి
BDK: అన్నపురెడ్డిపల్లిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించాలని మండల బంజారా జెఏసీ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగం సభ్యులు బాణావత్ భీముడు, భానోత్ వెంకటేశ్వర్లు, భూక్యా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.