పెదనందిపాడులో పోలీసుల విస్తృత ప్రచారం

GNTR: వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెదనందిపాడు ఎస్సై మధు పవన్ మైకు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నిమజ్జనాల సమయంలో, మండపాల వద్ద గొడవలు జరిగితే కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుల అనుమతి తీసుకున్నాకే గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదివారం కోరారు.