ధర్మవరంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం

ధర్మవరంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం

AKP: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.