మోత మోగిన కరెంట్ బిల్లు.. వాటర్ హీటర్ కారణమే..!

HYD: గ్రేటర్ పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చంద్రాయన గుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. దీనికి అనేకమంది వాటర్ హీటర్లు వాడటమే కారణం అని తెలిసింది.