'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అధిక ఫిర్యాదులు'
కోనసీమ: కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం అధికారులు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా అధిక ఫిర్యాదులు వచ్చాయి. ఇండ్ల స్థలాలు కేటాయించాలని 135 మంది ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో భానుజీ తెలిపారు. అదేవిధంగా రేషన్ కార్డు, స్థల సర్వే సమస్యలుపై మరికొన్ని అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు.