బాధిత కుటుంబానికి కిషన్ నాయక్ ఆర్థిక సహాయం

NLG: దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికీ చెందిన మల్లోజు కుమార్ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నది. విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ సోమవారం అమ్మాయి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రం రమేష్, మునందర్ రెడ్డి, ఆంగోత్ సంతోష్ నాయక్, శ్రీరాములు తదితరులు ఉన్నారు.